How To Create A Blog In Telugu
How to start a Telugu blog?
Blogging in Telugu అని మీరు టైపు చేసి ఉంటే, బ్లాగింగ్ అనే పదం మీరు ఇప్పటికే విని ఉంటారు. మీకు బ్లాగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి, ఎలా స్టార్ట్ చెయ్యాలో తెలియకపోతే, నేను రాసిన ఈ ఆర్టికల్ చదవడం పూర్తి చేసిన తరవాత మీకు Telugu Blogging మీద ఒక క్లారిటీ వస్తుంది అని అనుకుంటున్నా.
అసలు బ్లాగింగ్ అంటే ఏంటి?
సింపుల్ గా చెప్పాలి అంటే, మనకి తెలిసిన విషయం లేదా అవగాహనా ఉన్న సబ్జెక్టు మీద బ్లాగ్ లేదా వెబ్సైటు క్రియేట్ చేసి మనకు knowledge ఉన్న విషయాలు ఆర్టికల్స్ రూపంలో ఇంటర్నెట్ లో ఉన్న రీడర్స్ తో పంచుకోవడమే బ్లాగింగ్.
బ్లాగ్ ఎలా స్టార్ట్ చేయాలి?
బ్లాగ్ ఎలా స్టార్ట్ చేయాలి అని సింపుల్ గా 5 స్టెప్స్ లో చూద్దాం.
1. ఒక బ్లాగింగ్ ప్లాట్ఫారం ఎంచుకోవడం.
2. డొమైన్ & వెబ్ హోస్టింగ్ సెలెక్ట్ చేస్కోవడం.
3. మీ హోస్టింగ్ నామెసెర్వెర్ ( DNS NameServers ) డొమైన్ తో కనెక్ట్ చేయడం
4. మీ హోస్టింగ్ సర్వర్ లో WordPress ఇన్స్టాల్ చేయడం.
5. బ్లాగ్ ని డిజైన్ చేయడం (థీమ్స్).
ఒక బ్లాగింగ్ ప్లాట్ఫారం ఎంచుకోవడం:
బ్లాగింగ్ లో ఇంపార్టెంట్ డెసిషన్ ఒక ప్లాటుఫార్మ్ ని ఎంచుకోవడం. మన బ్లాగ్ ని క్రియేట్ చేయడానికి మార్కెట్ లో చాలా ప్లాట్ఫారం ఉన్నాయి. బ్లాగ్గింగ్ ప్లాట్ఫారం అంటే కంటెంట్ మానెజ్మెంట్ సిస్టమ్(CMS).
మార్కెట్ లో బాగా పాపులర్ గా ఉన్న రెండు కంటెంట్ మానేజ్మెంట్ సిస్టమ్స్:
1 .బ్లాగర్ (Blogger)
2 . వర్డుప్రెస్ (WordPress)
Blogger
బ్లాగర్ అనేది గూగుల్ యొక్క ఫ్రీ బ్లాగింగ్ ప్లాటుఫార్మ్. ఐతే బ్లాగర్ లో మన బ్లాగ్ పేరు కి చివర్లో blogspot.com అని వస్తుంది , ఉదాహరణకి blogname.blogpost.com. మీకు కొంచెం కూడా బ్లాగ్ గురించికాని బ్లాగింగ్ గురించిగాని తెలియకపోతే మీరు ఈ బ్లాగర్ నుండి స్టార్ట్ చేయమని నా సలహా.
ఇప్పుడు ఉన్న ఫేమస్ బ్లాగర్స్ లో చాలా మంది Telugu Bloggers ఈ బ్లాగర్ ప్లాటుఫార్మ్ నుండి స్టార్ట్ చేసినవారే, ఐతే మనకి blogSpot లో చాలా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మన బ్లాగ్ ని మనకి నచ్చిన విధంగా డిజైన్ చేసుకొనే అవకాశం మనకి blogSpot లో ఉండదు.
బ్లాగర్ ప్లాటుఫార్మ్ వాళ్ళ కొన్ని రిస్ట్రిక్షన్స్:
1. Blog కస్టమైజషన్ చేసుకునే అవకాశం ఉండదు.
2. బ్లాగర్ థీమ్స్ వాళ్ళ మీ బ్లాగ్ కి ప్రొఫెషనల్ లుక్ ఉండదు.
3. బ్లాగర్ లో యాడ్స్ నుండి సంపాదించడం కూడా అంత సులభం కాదు.
4. చిన్న కాపీరైట్ ఇష్యూ వచ్చిన, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీ బ్లాగ్ ని డిలీట్ చేసే అవకాశం బ్లాగ్స్పాట్(Google) కి ఉంటది.
మీరు బ్లాగింగ్ కి కొత్త అనుకుంటే, మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేవరకు బ్లాగర్ లో ట్రై చేయండి. ఇనీషియల్ గా బ్లాగర్ లో స్టార్ట్ చేయడం వాళ్ల మీకు ఎక్స్పీరియన్స్ తో పాటు కంటెంట్ రైటింగ్ స్కిల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి బ్లాగర్ కంటే వర్డుప్రెస్ చాలా చాలా బెస్ట్ ఆప్షన్.
WordPress
వరల్డ్ వైడ్ గా ఉన్న 59% వెబ్సైట్ ఈ వర్డుప్రెస్ ఉపయోగించి క్రియేట్ చేసినవే, ఇప్పటికే మీకు అర్థమైవుంటది వర్డుప్రెస్ అనేది ఎంత పాపులర్ CMS.
వర్డుప్రెస్ లో ఉండే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు నచ్చిన డిజైన్ తో మన బ్లాగ్ ని రుప్పొందించొచ్చు, వీటి కోసం మార్కెట్ లో మనకి చాలానే ఫ్రీ మరియు పైడ్ థీమ్స్ అందుబాటులో ఉన్నాయి.
WordPress తో స్టార్ట్ చేయడం వాళ్ళ లాభాలు:
1. వర్డుప్రెస్స్ ప్లాటుఫార్మ్ చాలా సెక్యూర్డ్ ఉంటది.
2. మీ బ్లాగ్ యొక్క టోటల్ కంట్రోల్ మీచేతిలో ఉంటది.
3. మీకు డౌట్ ఉన్న విషయాలు వర్డుప్రెస్ కమ్యూనిటీ లో అడిగి తెలుసుకోవచ్చు.
4. మీకు కావలసిన ఫీచర్స్ ని సింపుల్ గా ఒక ప్లగిన్ తో యాడ్చేస్కోవచ్చు .
నోట్:- కొత్తగా ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు బ్లాగర్ లో ట్రై చేయండి. ఆల్రెడీ కొంచెం తెలిసి మరియు కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు వర్డుప్రెస్ తో మీ కొత్త బ్లాగింగ్ కెరీర్ ని స్టార్ట్ చేయండి.
డొమైన్ & వెబ్ హోస్టింగ్ సెలెక్ట్ చేస్కోవడం:
డొమైన్ అంటే మన వెబ్సైటు కోసం తీసుకునే ఒక వెబ్ అడ్రస్. ఉదాహరణకి bloggingbadi.com అనేది ఒక డొమైన్. డొమైన్ తీసుకునే ముందు మనం తెలుసుకోవలసిన విషయం డొమైన్ టైప్స్(డొమైన్ రకాలు ).
డొమైన్స్ లో చాలా రకాలు ఉంటాయి(.com, .in, .net). అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్(Popular) ఉన్న డొమైన్ (.com)
మీరు కేవలం ఇండియాలోని ఆడియన్స్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటే మీరు (.in) డొమైన్ కూడా తీస్కోవచ్చు. కానీ మీ బ్లాగ్ పేరుమీద (.com) డొమైన్ ఎవైలబుల్ ఉంటే (.com) తీసుకోవడం మంచిది.
డొమైన్ నేమ్ సెలక్షన్ లో అందరు చేసే తప్పు 15 క్యారెక్టర్ కన్నా ఎక్కువ ఉన్న నేమ్ తీసుకోవడం. మీరు మాత్రం ఆ తప్పు చేయొద్దు, మీ బ్లాగ్ యొక్క పేరు షార్ట్ అండ్ స్వీట్ గా ఉండే విధంగా చూసుకోండి.
డొమైన్ తీసుకోవడానికి మనకి Godaddy, Bigrock, namecheap వంటి సైట్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఫస్ట్ టైం డొమైన్ తీసుకునేవారితే godaddy లో మీకు మంచి ఆఫర్ ఉంటాయి.
example గా నేను top telugu blogs అనే డొమైన్ ఎవైలబుల్ ఉందోలేదో చెక్ చేస్తున్న
మనం search చేసిన డొమైన్ ఎవైలబుల్ గా ఉంటే ఇలా చూపిస్తుంది
వెబ్ హోస్టింగ్ (Web Hosting):
వెబ్ హోస్టింగ్ అంటే మన బ్లాగ్ కి అవసరమైన ఫైల్స్ (మనం బ్లాగ్ కి ఉపయోగించే images మరియు ఆర్టికల్స్) అన్నిఒక్కచోట స్టోర్ చేసుకునే ఒక ప్లేస్.మీ బ్లాగ్ లేదా వెబ్సైటు స్పీడ్ అనేది మీరు తీసుకునే వెబ్ హోస్టింగ్ కంపెనీ మీద ఆధారపడి ఉంటది. అందుకే హోస్టింగ్ తీసుకునే ముందు అలోచించి తీసుకోవాలి.
మార్కెట్లో వెబ్ హొసింగ్ సర్వీసెస్ ఇస్తున్న కంపెనీస్(Bluehost, Hostgator , SiteGround , A2Hosting ఇలా చాలా ఉన్నాయి).ప్రస్తుతం నేను వాడుతున్నది siteground హోస్టింగ్. నాకు ఇప్పటి వరకు వచ్చిన టెక్నికల్ ఇష్యూస్ కి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఇచ్చారు. ఇంకా నేనైతే siteground ప్రిఫర్ చేస్తా.
మీరు కొత్తగా స్టార్ట్ చేస్తుంటే Startup ప్లాన్ సరిపోతాది. ఒకటి కంటే ఎక్కువ బ్లాగ్స్ క్రియేట్ చేయాలి అనుకునేవారు GrowBig ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి
నోట్:- డొమైన్ మరియు వెబ్ హోస్టింగ్ ఎలా తీసుకోవాలి అని నేను సెపరేట్ గా ఒక ఆర్టికల్ రాసాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అదికూడా చదవండి.
మీ హోస్టింగ్ నామెసెర్వెర్ ( DNS NameServers ) డొమైన్ తో కనెక్ట్ చేయడం:
మీరు డొమైన్ మరియు హోస్టింగ్ తీసుకున్నాక చేయాల్సిన మొదట పని, వాటి nameservers అప్డేట్ చేయడం.
మీ హోస్టింగ్ ప్రొవైడర్ మీకు ఇమెయిల్ ద్వారా namservers మెయిల్ చేస్తారు, వాటిని మీరు మీ యొక్క డొమైన్ DNS nameservers లో మ్యాప్ (అప్డేట్) చేయాల్సివుంటుంది.
మీరు మ్యాప్ చేసిన 24 గంటలో మీ namservers అప్డేట్ అవుతాయి.
మీ హోస్టింగ్ సర్వర్ లో WordPress ఇన్స్టాల్ చేయడం:
మీరు తీసుకున్న హోస్టింగ్ సర్వర్ లో wordpress ఇన్స్టాల్ చేయడం చాలా సింపుల్.
కింద ఉన్న స్క్రీన్ షాట్స్ ఫాలో అవ్వండి.
మీరు మీ యొక్క హోస్టింగ్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.
1. మీకు డాష్బోర్డ్ లో మీ వెబ్సైటు కనిపిస్తుంది, పక్కనే ఉన్న సైట్ టూల్స్ ఆప్షన్ క్లిక్ చేయండి.
2. టూల్స్ డాష్బోర్డ్ కి redirect అవుతారు,తర్వాత app manager ఆప్షన్ క్లిక్ చేయండి
3. Install new application లో wordpress సెలెక్ట్ చేసుకోండి.
4. కింద మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి install క్లిక్ చేయండి. సింపుల్ గా wordpress ఇన్స్టాల్ అవుతుంది.
బ్లాగ్ ని డిజైన్ చేయడం:
బ్లాగుని డిజైన్ చేయడానికి అసలు మనకి ఏం కావాలి?
మీరు ఇప్పటికే wordpress థీమ్స్ గురించి వినేవుంటారు, బ్లాగుకి ఒక ప్రొఫెషనల్ లుక్ రావాలంటే మనకి కోడింగ్ వచ్చి ఉండాలి. అందరికి కోడింగ్ రాదు కాబ్బటి, కొన్ని కంపెనీస్ మనకి కోడింగ్ చేసిన wordpress ప్రీమియం థీమ్స్ అమ్ముతారు.
మనం మన బ్లాగుకి తగ్గ థీమ్ ని కొన్నుకుని wordpress లో ఇన్స్టాల్ చేసుకోవాలి.
మార్కెట్లో ప్రీమియం థీమ్స్ అమ్ముతున్న కొన్ని కంపెనీస్
1. Themeforest
2. StudioPress
3. Mythemeshop
మీరు ఏ niche (health ,tech,sports,blogging,gadgets) తీసుకున్న వాటికీ సంబంధించిన థీమ్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా మీ బ్లాగుకి తగ్గ థీమ్ ని సెలెక్ట్ చేసుకోవడం.
థీమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి & థీమ్స్ గురించి డిటైల్డ్ గా ఇంకొక ఆర్టికల్ రాస్తాను.
wordpress థీమ్ ఎలా ఇన్స్టాల్(install) చేయాలి?
ముందుగా మీ wordpress dashboard ఓపెన్ చేయండి.
1. side menu లో appearance ఆప్షన్ క్లిక్ చేయండి.
2. తరవాత Themes ఆప్షన్ క్లిక్ చేయండి.(Themes విండో ఓపెన్ అవుతుంది)
3. Add New పైన క్లిక్ చేయండి.
4. upload theme పైన క్లిక్ చేసి అప్లోడ్ చేసి install చేయండి.
మీరు అప్లోడ్చేసిన థీమ్ ని మీకు నచ్చిన విధంగా కస్టమైజషన్ చేసుకుని బ్లాగ్ ని లాంచ్ చేయాలి.
ఒక్క బ్లాగ్ కి డొమైన్ తీసుకుని సర్వర్ లో హోస్ట్ చేయడానికి మనకి తక్కువలో నెలకి Rs.350 అవుతుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ రోజు మీరు స్టార్ట్ చేసిన బ్లాగ్ మీకు ఒక గుర్తింపు తెచ్చి మరియు ఇన్కమ్ సోర్స్ గా కూడా ఉపయోగపడుతుంది.
ఒకరి కింద పని చేయడం ఇష్టంలేక తమ తమ ఉద్యోగాలు వదిలి బ్లాగింగ్ ని ఒక కెరీర్ గా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు గుర్తుపెట్టుకోండి.
How To Create A Blog In Telugu
Source: https://bloggingbadi.com/how-to-start-blog-in-telugu/
Posted by: lowewincert.blogspot.com
0 Response to "How To Create A Blog In Telugu"
Post a Comment